మోదీపై ఉన్న  నమ్మకమే బీహార్ లో గెలిపిస్తుంది 

ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకమే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గెలిపిస్తుందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భరోసా వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ పోల్ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆయన రాష్ట్రంలో ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రధాని మోదీ  పేరు చెబితే జనాల్లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోందని చెప్పారు. 

యావత్ దేశం మొత్తం ప్రజల్లో మోదీపై ఉన్న ప్రేమ, నమ్మకం అలాంటిదని ఆయన చెప్పారు. ప్రధానిపై ఉన్న ఈ నమ్మకం కేవలం బీజేపీకి మాత్రమే కాదు, తమ మిత్ర పక్షాలకు కూడా ఉపయోగ పడుతుందని ఆయన పేర్కొన్నారు. బీహార్‌లోనూ అదే జరగబోతోందని స్పష్టం చేశారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో  మళ్లీ అధికారం సొంతం చేసుకోవాలని బీజేపీ, జేడీయూ కూటమి గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ  సహా సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులను సైతం ఆ రాష్ట్రంలో ప్రచారంలోకి బిజెపి దించుతోంది.  మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 121, జేడీయూ 122 సీట్లలో పోటీ చేయబోతున్నాయి.