ములాయం సింగ్‌ కు కరోనా  

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థపాకుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ (80) కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని పార్టీ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది.
 
ప్రస్తుతం వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని, కోవిడ్‌ లక్షణాలేవీ ములాయంలో లేవని పేర్కొంది. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎస్‌పి అధినేత, ములాయం కుమారుడు అఖిలేష్‌ యాదవ్‌ తెలిపారు. 
 
కోవిడ్‌-19 పాజిటివ్‌ తేలగానే.. చికిత్స నిమిత్తం గుర్గావ్‌లోని వేదాంత ఆసుపత్రిలో చేరారని, ఎప్పటికప్పుడు తన ఆరోగ్యంపై సమాచారం అందించాలని సీనియర్‌ వైద్యులతో మాట్లాడానని అఖిలేష్‌ చెప్పారు.  
 
ఇలా ఉండగా, భారీత దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు 73 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 67,735 కరోనా కేసులు నమోదు కాగా.. 680 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పాజిటీవ్ కేసులు 73,07,125కి చేరాయి. ఇప్పటి వరకు 1.11 లక్షల మంది మరణించారు. 
 
దేశంలో ప్రస్తుతం 8,12,390 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా.. చికిత్స నుంచి కోలుకుని ఇప్పటి వరకు 63,83,442 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 86.78 శాతం ఉందని, మరణాల రేటు 1.53 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.