చంద్రబాబు నివాసానికి వరద నోటీసులు

భారీ వర్షాలు, వరదలతో విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంఉండగా.. అది 6 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది.

కృష్ణా నది కరకట్ట లోపలవైపు ఉన్న 36 అక్రమ కట్టడాలకు  వరద ప్రమాద హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. కరకట్ట లోపలవైపు ఉన్న భవనాలు ఖాళీ చేసి.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కరకట్ట లోపల ఉన్న చంద్రబాబు నివాసానికి కూడా అధికారులు నోటీసులు అందజేశారు. 

మంగళవారం మధ్యాహ్నం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి మరోసారి నోటీసులు పంపారు. కరకట్ట నిర్మాణాలను ఖాళీ చేయాల్సిందేనని.. సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఏక్షణమైనా వరద ఇంట్లోకి రావచ్చని రెవెన్యూ శాఖ ముందుగా అలెర్ట్ అయ్యింది.