అరిహ్యాండ్ పవారియా
విదేశీ నిధుల (నియంత్రణ) సవరణ బిల్, 2020కు పార్లమెంట్ ఆమోదం లభించింది. వ్యక్తులు, సంఘాలు, లేదా కంపెనీలు విదేశీ నిధులను అంగీకరించడం, ఉపయోగించడంను నియంత్రణ చేయడం కోసం గతం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం 2010లో ఆమోదించిన ఎఫ్ సి ఆర్ చట్టంలో ఈ బిల్లు ద్వారా చెప్పుకోదగిన మార్పులు తీసుకు వచ్చారు.
దశాబ్దం క్రితం ఈ చట్టాన్ని ఆమోదించినప్పటి నుండి అనేక ఆరోపణలు పేరుకుపోతూ వస్తున్నాయి. జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించే కార్యక్రమాలను భారత భూభాగంలో చేపట్టడం ద్వారా భారత దేశ వ్యవహారాలలో విదేశీ శక్తులు జోక్యం చేసుకోవడానికి ఈ చట్టం చట్టబద్ధ మార్గం కల్పిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ చట్టంలో తీసుకు వచ్చిన ప్రధానమైన మార్పులు ఏమిటి?
మొదటగా, ఒక వ్యక్తి నుండి మరొకరికి విదేశీ నిధులను బదిలీ చేయడంను నిషేధించడం చెప్పుకోదగిన మార్పు. మొదటి చట్టంలో విదేశీ నిధులు స్వీకరించడానికి నమోదు చేసుకొని ఉంటె లేదా విదేశీ నిధులు స్వీకరించడానికి ప్రభుత్వం నుండి ముందుగా అనుమతి పొందితే విదేశీ నిధులను మరెవ్వరికైనా బదిలీ చేసే అవకాశం ఉంది.
కానీ, ఇప్పుడు ఆ విధంగా నిధులను మరో వ్యక్తికి లేదా నమోదైన సంసథకు బదిలీ చేయడాన్ని ఈ బిల్లు నిషేధించింది. ఇది ముఖ్యమైనది ఎందుకంటె భారీ విదేశీ నిధులు సమకూర్చే సంస్థలు ఎక్కువ మొత్తాలను దేశంలో ఎంపిక చేసిన కొన్ని ఎన్జీవోలకు పంపి, వారి ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఇతరులకు బదిలీ చేస్తూ వస్తున్నారు.
ప్రాధమికంగా గరిష్టంగా మిషనరీ సంస్థల నుండి విదేశీ నిధులు ఆకర్షిస్తున్న దక్షిణాది రాష్ట్రాలలోని ఎన్జీఓ లు ఉత్తరాదిన మతమార్పిడిలకు పాల్పడగల సామర్ధ్యం గలవారికి పంపడం జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు అటువంటి సంస్థలు ఈ సవరణ కారణంగా తమ ప్రభావాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
రెండో ముఖ్యమైన అంశం విదేశీ నిధులను స్వీకరిస్తున్న ఎన్జీఓలు వాటిని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాయన్న అంశం. ఇప్పటి వరకు వస్తున్న విదేశీ నిధులలో 50 శాతం వరకు తమ నిర్వహణ వ్యయం కోసం వినియోగించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈ బిల్లు ఆ మొత్తాన్ని 20 శాతంకు పరిమితం చేసింది.
దానీతో కొన్ని పెద్ద పెద్ద ఎన్జీఓలు తమ విలాసవంత వ్యయాలను కుదించుకోవలసి వస్తుందని ఆందోళన చెందడం సహజమే. ఎఫ్ సి ఆర్ ఎ మార్కెట్ లో కొన్ని పెద్ద సంస్థల నిర్వహణ వ్యయం ఆశ్చర్యం గొలుపుతుంది. ఈ ఎన్జీఓలు తాము విదేశాల నుండి పొందుతున్న నిధులలో ఆత్యధికంగా క్షేత్ర స్థాయిలో `సంక్షేమ’ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నారనే సాధారణ అభిప్రాయం సరైనది కాదు.
విదేశాల నుండి వస్తున్న నిధులలో అత్యధిక భాగం దేశంలో ప్రముఖుల వద్ద తమ పలుకుబడి పెంచుకోవాలని, భారీ జీతాలు చెల్లించడానికి, పరోక్షంగా లాబీయింగ్ జరపడానికి, చివరకు కోర్ట్ కేసులకు కూడా ఖర్చు చేస్తున్నారు. ఆ విధంగా దేశ ప్రయోజనాలకు, ముఖ్యంగా హిందువులకు వ్యతిరేకంగా నిధులను ఖర్చు పెడుతున్నారని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి.
మూడవ అతిపెద్ద మార్పు పర్యవేక్షణకు సంబంధించినది. అన్ని విదేశీ నిధులను ఢిల్లీలోని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా బ్రాంచ్ లో నిర్వహించే ఒకే “ఎఫ్ సి ఆర్ ఐ అకౌంట్” ద్వారా మాత్రమే స్వీకరించాలి.
దానితో మొత్తం ఎన్ని నిధులు, ఏ విధంగా వస్తున్నాయో, వాటిని ఏ విధంగా ఎన్జీఓలు ఖర్చు పెడుతున్నాయో పర్యవేక్షించడం ప్రభుత్వంకు సులభం కాగలదు. పైగా, ఆధార్ ను జత చేయడం ద్వారా ఎఫ్ సి ఆర్ ఐ పరిశ్రమలో గల వ్యక్తుల అందరిని జవాబుదారీతనం చేయడానికి వీలు ఏర్పడుతుంది.
నాలుగోవ అంశం ప్రభుత్వం ఉద్యోగులు (ఉద్యోగం చేస్తున్నవారు, ప్రభుత్వం నుండి జీతం లేదా పారితోషికం స్వీకరించే వారు) ఈ నిధులు స్వీకరించడాన్ని ఈ బిల్లు నిషేధిస్తుంది.
ఇదివరలో ఈ నిబంధన కేవలం ఎన్నికైన వారికి, వార్త పత్రికల సంపాదకుడు లేదా ప్రచురణకర్తలకు, న్యాయమూర్తులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, చట్టసభలు లేదా రాజకీయ పార్టీల సభ్యులకు మాత్రమే వర్తించెడిది.
విదేశీ నిధులను విదేశీ సంస్థల ప్రయోజనాల కోసం మన ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేందుకు వాడుతున్నారని విమర్శలు ఇంతకు ముందుండెడివి. దానితో ఈ అంశం కీలకం కానున్నది. ఈ అంశాలు అన్ని మన జాతీయ వ్యవహారాలలో విదేశీ నిధుల ప్రభావాన్ని కట్టడి చేయడంలో విశేషమైన పాత్ర వహించగలవు.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్లపై వేటు