
కశ్మీర్ లో అల్లర్లు సృష్టించేందుకు పాకిస్తానీ ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కిషన్ గంగా నది వెంబడి ఉగ్రవాదుల కదలికలను పసిగట్టింది ఆర్మీ. ట్యూబులలో ఆయుధాలు పెట్టి తాడు సాయంతో కిషన్ గంగా నది నుంచి భారత్ లోకి పంపేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది.
ఉగ్రవాదులు పారిపోగా సైన్యం ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. నాలుగు ఏకే 47 రైఫిల్స్, 8 మ్యాగజీన్లు, 240 రౌండ్ల బుల్లెట్లు ట్యూబ్ లో ఉన్నాయని గుర్తించారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ సారి ఉగ్రవాదుల చొరబాట్లు తగ్గాయని సైనిక వర్గాలు తెలుపుతున్నాయి.
గతేడాది 130వరకు చొరబాటు యత్నాలు జరగ్గా ఈ సారి 30లోపే ఉన్నాయని చినార్ కాప్స్ కమాండర్ బిఎస్ రాజు చెప్పారు. భారత్ లోకి ఆయుధాలు పంపి ఉగ్రవాదులకు అందించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. పాకిస్తాన్ లోని లాంచ్ పాడ్స్ లో 250 నుంచి 300 మంది వరకు ఉగ్రవాదులున్నారని నిఘా వర్గాలు తెలిపినట్లు తెలిపారు.
More Stories
కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం సీట్లు మగాళ్లకే
ధనిక దేశాలు భారత్ కు భారీగా పరిహారం చెల్లించాలి
ఆవులు, ప్లకార్డులతో కర్ణాటక బీజేపీ నిరసనలు