లక్ష్మీ దేవిని ఆరాధిస్తున్న హాలీవుడ్ హీరోయిన్

హిందువులు కొలిచే లక్ష్మీ దేవిని తానూ ఆరాధిస్తానని మెక్సికో, అమెరికన్ స్టార్ యాక్టర్ సల్మా హయెక్ తెలిపింది. తన అంత: సౌందర్యంతో అనుసంధానం కావాలని అనుకున్నప్పుడు లక్ష్మీ మాతను తలచుకుంటానని ఇన్ స్టా పోస్ట్‌‌లో సల్మా పేర్కొంటూ లక్ష్మీ దేవి ఫొటోను షేర్ చేసింది. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
 
‘ఎప్పుడైతే నేను నా ఇన్నర్ బ్యూటీతో కనెక్ట్ అవ్వాలని అనుకుంటానో అప్పుడు మెడిటేషన్ చేస్తా. ఆ సమయంలో లక్ష్మీ దేవతపై దృష్టి కేంద్రీకరిస్తా. హిందువుల దేవతైన లక్ష్మీ మాత సంపద, అదృష్టం, ప్రేమ, అందం, మాయ, ఆనందంతోపాటు శ్రేయస్సును ఇస్తుందని నమ్మకం. ఆమె రూపం నన్ను సంతోషంగా ఉండేలా చేస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు. 
 
“మీ అంత: సౌందర్యం తెలుసుకోవాలంటే ఆనందంగా ఉండటమే తొలి మెట్టు. నేను ఒకే దైవాన్ని ఆరాధిస్తా. కానీ మంచి చెప్పే అన్ని సిద్ధాంతాలను నమ్ముతా. దీవెనల కోసం ధన్యవాదాలు’ అని స్పానిష్ ఫిల్మ్స్‌‌లో కూడా నటించే సల్మా చెప్పింది. 
 
ఈ పోస్టును లక్ష మందికిపైగా లైక్ చేయడం విశేషం. సల్మా భారత అభిమానులు ఆమె పోస్టు చూసిన తర్వాత చాలా ఖుషీ అయ్యారు. హిందూయిజంపై మీ ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ఓ ఫ్యాన్ ఆమెకు సమాధానంగా ట్వీట్ చేసాడు.