
పదేళ్ల తర్వాత మన్యంలో మావోల అలజడి పెరిగింది. ఏజెన్సీ ఏరియాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. తమ కార్యకలాపాలు పెంచేందుకు ఒక వంక మావోయిస్టులు ప్రయత్నిస్తుంటే, మరోవంక ఆదిలోనే మావోలకు చెక్ పెట్టాలని పోలీసులు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు.
ఏజెన్సీ ఏరియాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్ట్ ప్రాభావిత ప్రాంతాల్లో కూంబింగ్స్ తో పాటు.. డ్రోన్లతో నిఘా పెట్టారు. గోదావరి, శబరి, ప్రాణహిత నదీ తీర ప్రాంతాలలో నిరంతర నిఘా కొనసాగుతోంది.
మరోవైపు నెలరోజుల్లో ఎన్ కౌంటర్లలో 8 మంది మావోలు చనిపోయారు. ఆరేళ్ల తర్వాత కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో తెలంగాణ- చత్తీస్ ఘడ్ , ఆంధ్ర-తెలంగాణ, ఒడిషా బోర్డర్లలో ఉద్రిక్త పరిస్థితులున్నాయి. ఇప్పటికే ఒక్కో ప్రాంతంలో రెండు మూడు సార్లు డీజీపీ పర్యటించారు.
పొరుగు రాష్ట్రాల పోలీసులతో కలిసి మావోయిస్టుల ఏరివేతకు జాయింట్ యాక్షన్ అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సహితం రెండు రోజులక్రితం శాంతిభద్రతలపై జరిపిన సమీక్షలో మావోలపై దృష్టి పెట్టాలని చెప్పారు.
More Stories
సైబర్ నేరగాళ్ల చేతిలో 16.80 కోట్ల మంది పర్సనల్ డేటా
సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణ 27న!
హైదరాబాద్ లో రెచ్చిపోతున్న వీధి కుక్కలు