ధ‌ర్మానికి, న్యాయానికి ప్ర‌తీక‌గా కోర్టు తీర్పు

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు తీర్పును బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్వాగతించారు. ధ‌ర్మానికి, న్యాయానికి ప్ర‌తీక‌గా కోర్టు తీర్పు వ‌చ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఒక వైపు రామాల‌య నిర్మాణం…మ‌రో వైపు 28 ఏళ్లుగా సాగుతున్న కేసు ప‌రిష్కారం జ‌ర‌గ‌డం పై ఆనందం వ్య‌క్తం చేశారు. 
 
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, రాజకీయ పక్షపాతంతో బీజేపీ నేతలపై, సాధువులు, వీహెచ్‌పీ నేతలపై కాంగ్రెస్ తప్పుడు కేసులు వేసిందని పేర్కొంటూకుట్ర పూరితంగా కూల్చివేత జ‌ర‌గ‌లేద‌ని కోర్టు తీర్పు ఇవ్వ‌డంతో బీజేపీ వాద‌న నిజ‌మైందని ఆమె తెలిపారు. ఇప్ప‌టికైన ఆయా పార్టీలు మ‌త రాజ‌కీయాలు మానుకోవాలని ఆమె సూచించారు. 
 
కాగా, అయోద్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.ఆడ్వాణీమురళీ మనోహర్ జోషి, ఉమా భారతిలతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తరువాత నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
బండి సంజయ్ హర్షం వ్యక్తం చేసారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ సహా పలు రాజకీయ పక్షాలు బిజెపిపై చేసినఆరోపణలు తప్పని తాజా తీర్పుతో రుజువైందని తెలిపారు. కాంగ్రెస్ తో పాటు, మైనారిటీ వాదాన్ని సమర్ధించే మతత్వపార్టీలు పార్టీలకు  తీర్పు చెంపపెట్టులాంటిదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా మత రాజకీయాలు మాని దేశంలో ప్రజలు ఎదుర్కుంటున్న  సమస్యలపైదృష్టి సారించాలని హితవు చెప్పారు.