ఎన్‌సీబీ ప్రశ్నలకు సమాధానం దాటేసిన దీపికా    

డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ఎన్‌సీబీ విచారణ ముగిసింది. తొలి రోజు ఆమెను ఐదు గంటల పాటు ఎన్‌సీబీ అధికారులు విచారించారు. మేనేజర్ కరిష్మాతో జరిగిన చాటింగ్‌పై దీపికాను ఎన్‌సీబీ ప్రశ్నించినట్లు తెలిసింది. 

ఎన్‌సీబీ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేసినట్లు తెలుస్తున్నది.  దీపిక ఇచ్చిన స‌మాధానాల‌తో ఎన్సీబీ అధికారులు సంతృప్తి చెంద‌లేద‌ని తెలుస్తోంది.   ఇవాళ ఉద‌యం 9 గంట‌ల‌కు ఎన్సీబీ ఆఫీసుకు వ‌చ్చిన దీపిక‌ను అధికారులు ప‌లు కోణాల్లో విచారించారు.  

ఇంకా ఆమెకు ఈ కేసులో క్లీన్ చిట్ ఇవ్వ‌లేదు. మ‌రోసారి దీపిక‌ను ఈ కేసులో విచారించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఎన్సీబీ వ‌ర్గాలు వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది.  కరిష్మాతో చాటింగ్ చేసినట్లు ఎన్‌సీబీ విచారణలో దీపిక ఒప్పుకుంది. కరిష్మాతో డ్రగ్స్‌కు సంబంధించి ఎలాంటి సంభాషణలు జరపలేదని ఆమె చెప్పినట్లు తెలిసింది.

డ్ర‌గ్స్ కేసులో మ‌రో న‌టి శ్ర‌ద్ధాక‌పూర్‌ను కూడా ఇవాళ ఎన్సీబీ విచారించింది.  డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని ఆమె విచార‌ణ‌లో వెల్ల‌డించింది. కానీ సుశాంత్ ఇచ్చిన ఫార్మ్‌హౌజ్ పార్టీకి మాత్రం హాజ‌రైన‌ట్లు ఆమె అంగీక‌రించింది. 

సీబీడీ ఆయిల్ గురించి జ‌య షాతో జ‌రిగిన చాటింగ్‌పై ఆమె ఎటువంటి స‌మాధానం ఇవ్వ‌లేదు. మ‌రో వైపు ఇదే కేసులో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ర‌విప్ర‌సాద్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. 

మరోవైపు 2019 నాటి కరణ్ జోహార్ డ్రగ్ పార్టీపై అధికారులు దృష్టి సారించారు. అయితే తానెప్పుడూ డ్రగ్స్ సప్లై చేయలేదని కరణ్ జోహార్ బుకాయించారు. రేపో మాపో కరణ్ జోహార్  కు కూడా నోటీసులు ఇవ్వనుంది నేషనల్ నార్కోటిక్స్ బ్యూరో. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విచారణ నిన్ననే ముగిసింది. దీపికా, శ్రద్ధాల విచారణ ముగిశాక మరోసారి రకుల్ ను ప్రశ్నించే అవకాశం ఉంది.