గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు అశృనయనాల మధ్య పూర్తి అయ్యాయి. చెన్నై శివారులోని ఫామ్ హౌస్‌లో జరిగిన అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాక ఖననం చేశారు. కోట్లాది అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానం సంపాదించిన బాలుకు కరోనా నేపథ్యంలో బాలు అంతిమయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, ప్రముఖులకు మాత్రమే అనుమతినిచ్చారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా అభిమానులు ఎవరూ బాలు అంత్యక్రియలకు రాకుండా, ఫాంహౌస్‌కు 2 కి.మీ దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ఎస్పీ బాలు భౌతిక కాయాన్ని చూసి దర్శకుడు భారతీరాజ కన్నీటి పర్యవంతమైయ్యారు. ‘ఎస్పీ బాలు ఎప్పటికీ నాతోనే ఉంటారు. ఆయన ఆత్మ మాతోనే ఉంది. భౌతికంగా మాత్రమే దూరం అయ్యాయి. పాటలు రూపంలో ఎప్పటికి చిరస్థాయిగా ప్రజలు మదిలో నిలిచిపోతారు’ అని విలపించారు.
బాలు ఇక లేరన్న సమాచారం అభిమాన లోకాన్ని కన్నీటి సంద్రంలో ముంచింది. తమ అభిమాన గాయకుడ్ని కడసారి చూసుకునేందుకు పోటెత్తారు. సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు ఈ మరణ సమాచారాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. తమ అభిమాన గాయకుడ్ని కడసారి చూసుకునేందుకు పోటెత్తారు.
అభిమానుల రాక పోటెత్తడంతో ఎస్పీబి ఇంటి పరిసరాలు ఇసుకెస్తే రాలనంతంగా పరిస్థితి మారింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ పరిసరాల్లోకి పెద్ద ఎత్తున జన సందోహం తరలి రావడంతో ఆరోగ్య పరమైన ఆందోళన తప్పలేదు. అభిమానుల్ని కట్టడి చేయడం మరింత కష్టతరంగా మారింది.
More Stories
ఖైదీలలో కులవివక్ష పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం
జార్ఖండ్లో రైల్వేట్రాక్ పేల్చివేత
వర్షాలు, వరదల వల్ల 1,492 మంది మృతి