శ్రీవారిని దర్శించుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు

తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం మరోసారి కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎస్ యడియూరప్పతో కలసి  దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం వద్ద ముఖ్యమంత్రి‌ స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం వేదపండితులు ఇరు ముఖ్యమంత్రులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు.
 శ్రీవారి దర్శనము ముగించుకుని  ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనంకు  ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు చేరుకున్నారు. లోక కళ్యాణర్ధం  కరోనా నేపథ్యంలో టీటీడీ  గత మార్చి నెలనుంచి ధన్వంతరి మహా యాగం, ధన్వంతరి యోగ వశిష్ట్యం, గీతా పారాయణం, సుందరకాండ పారాయణం నిర్వహిస్తోన్న కార్యక్రమంలో ఇరువురు సీఎం పాల్గొన్నారు.
కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి సీఎం జగన్ అక్కడ రూ 200 కోట్లతో నిర్మించనున్న కర్ణాటక సత్రాల భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొన్నారు. మైసూరు మహారాజుల సమయం నుంచి తిరుమలలో కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి ఉన్న 7ఎకరాలు భూమిలో నూతన అతిధి గృహాన్ని కర్నాటక ప్రభుత్వం నిర్మించనుంది.