కరోనా సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుంగదీసిందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) పేర్కొన్నది. దీని ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత్ 5.9% ప్రతికూల వృద్ధిరేటును నమోదు చేయవచ్చని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ 3.9% రికవరీని సాధించే అవకాశమున్నదని తెలిపింది.
అయినప్పటికీ ప్రస్తుత క్షీణత శాశ్వత ఆదాయ నష్టానికి దారితీయవచ్చని అభిప్రాయపడింది. యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ) కాన్ఫరెన్స్‌లో విడుదల చేసిన ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్-2020లో ఐరాస ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసింది.
కొవిడ్-19 వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, ఫలితంగా ఈ ఏడాది 4.3% ప్రతికూల వృద్ధి నమోదు కావచ్చని తెలిపింది. ఈ ఏడాది దక్షిణాసియా వృద్ధిరేటు 4.8% క్షీణిస్తుందని, వచ్చే ఏడాది ఇది 3.9% పుంజుకునే అవకాశం ఉన్నదని యూఎన్‌సీటీఏడీ అంచనా వేసింది.
అలాగే 2020లో అమెరికా వృద్ధి రేటు -5.4%గా నమోదవుతుందని, వచ్చే ఏడాది ఇది 2.9% రికవరీ సాధించవచ్చని తెలిపింది. చైనాలో మాత్రం ఈ ఏడాది 1.3% వృద్ధి నమోదవుతుందని, వచ్చే వచ్చే ఏడాది గణనీయంగా 8.1 శాతానికి పుంజుకోవచ్చని ఐరాస అభిప్రాయపడింది.
More Stories
ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్లో ఈడీ సోదాలు
ఎస్బీఐలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు
రూ.1,800 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం