గ్రేటర్‌‌ జిల్లాలకు బీజేపీ కొత్త అధ్యక్షులు

గ్రేటర్ హైదరాబాద్‌‌ను 6 జిల్లాలుగా విభజించిన బీజేపీ వాటికి ఇప్పుడు కొత్త అధ్యక్షులను నియమించింది. గ్రేటర్‌‌తో పాటు రాష్ట్రంలో కొంతకాలంగా పెండింగ్‌‌లో ఉన్న మరో 6 జిల్లాలకూ అధ్యక్షులను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ నియమించారు.  

  1. సనత్‌‌నగర్, ముషీరాబాద్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ సెగ్మెంట్లు కలిపి మహంకాళి సికింద్రాబాద్ జిల్లాగా ఏర్పాటు. అధ్యక్షుడు శ్యాంసుందర్‌‌గౌడ్.
  2. అంబర్‌‌పేట్, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలు కలిపి అంబర్‌‌పేట జిల్లాగా ఏర్పాటు. జిల్లా అధ్యక్షుడు ఎన్. గౌతంరావు.
  3. గోషామహల్, కార్వాన్, చార్మినార్ నియోజకవర్గాలు కలిపి గోల్కొండ జిల్లాగా ఏర్పాటు. జిల్లా అధ్యక్షుడు పాండు యాదవ్.
  4. చాంద్రాయణ గుట్ట, యాకుత్‌‌పుర, మలక్‌‌పేట, బహదూర్‌‌పుర సెగ్మెంట్లు కలిపి మలక్‌‌పేట జిల్లా ఏర్పాటు. జిల్లా అధ్యక్షుడు సాంరెడ్డి సురేందర్‌‌రెడ్డి.

5.   రంగారెడ్డి జిల్లాను రంగారెడ్డి అర్బన్ జిల్లాగా ఏర్పాటు. జిల్లా అధ్యక్షుడిగా సామ రంగారెడ్డి.

  1. గ్రేటర్ పరిధిలోకి వచ్చే మేడ్చల్ జిల్లాను మేడ్చల్ అర్బన్జిల్లాగా ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా పన్నాల హరీశ్‌‌రెడ్డిని నియమించారు.
 
కాగా, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షునిగా పి. విక్రమ్‌‌రెడ్డిని, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే కుమారి అరుణ తారను,  జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా పైడిపల్లి సత్యనారాయణ రావును, ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా గల్ల సత్యనారాయణను, సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా బొబ్బ భాగ్యరెడ్డిని, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సదానంద రెడ్డిలను నియమించారు.