హైదరాబాద్ నగరంలోని భారతీయ సునామీ ప్రారంభ హెచ్చరికల కేంద్రం 25 హిందూ మహాసముద్ర దేశాలకు సునామీ సేవలు అందిస్తుందని కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్‌ఫర్‌మేషన్ కేంద్రం 25 దేశాలకు సునామీ సేవలు అందిస్తుందని కేంద్రమంత్రి హర్షవర్ధన్ తాజాగా వెల్లడించారు.
ఈ మేర రాజ్యసభలో ఓ ప్రశ్నకు మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. భూవిజ్ఞానమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని హైదరాబాద్ కేంద్రం ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ లో భాగంగా సేవలు అందించనుంది.
సునామీ మోడలింగ్, తీరప్రాంత ప్రవాహం గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి అండమాన్ నికోబార్ దీవుల్లో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం, స్ట్రాంగ్ మోషన్ యాక్సిలెరోమీటర్లను ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు.
సముద్ర తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయం చేసుకుంటూ సునామీ మాక్ అలర్ట్, శిక్షణ సమావేశాలు నిర్వహిస్తుందని మంత్రి వివరించారు.
More Stories
ట్యాంక్బండ్ వద్ద ఫ్లెక్సీలు, బారికేడ్లను తొలిగిన గణేశ్ ఉత్సవ సమితి
ముడి పామాయిల్ దిగుమతిపై పన్ను పెంపు
గల్ఫ్ కార్మికుల పిల్లలకు అడ్మిషన్లు, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు