రూ 1,350 కోట్లతో జమ్మూ కశ్మీర్‌కు ఆర్థిక ప్యాకేజీ 

రూ 1,350 కోట్లతో జమ్మూ కశ్మీర్‌కు ఆర్థిక ప్యాకేజీ 

కరోనా నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వ్యాపారవేత్తలకు శనివారం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. 1,350 కోట్లతో ఈ ప్యాకేజీని ప్రకటించారు. నీరు, విద్యుత్ బిల్లుల్లో ఏకంగా 50 శాతం రాయితీని ప్రకటించారు. 

దీనితో పాటు రుణాన్ని తీసుకునే వారందరికీ 2021 మార్చి వరకు స్టాంప్ డ్యూటీని మినహాయింపును కూడా ప్రకటించారు. అదే విధంగా పర్యాటక రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకు ‘హెల్త్- టూరిజం’ పథకం కింద సాయాన్ని కూడా ప్రకటించారు.

చేనేత, హస్త కళల రంగంలో ఉన్న వారికి క్రెడిట్ కార్డ్ పథకం కింద లక్ష నుంచి 2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి యువత, మహిళా వ్యాపారవేత్తలకు బ్యాంకుల్లో ప్రత్యేక డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. 

ఆరు నెలల పాటు వ్యాపార సంఘంలోని ప్రతి రుణ గ్రహీతకు బేషరతుగా 5 వాతం వడ్డీని కూడా చెల్లించాలని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఉపాధిని కల్పించడంలో ఈ ప్యాకేజీ ఎంతో ఉపకరిస్తుందని ఎల్జీ మనోజ్ సిన్హా పేర్కొన్నారు.

‘‘1,350 కోట్లతో వ్యాపార వేత్తలకు ఓ ఆర్థిక ప్యాకేజీని ఆమోదించాం. గతంలో ప్రధాని మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర భారత్‌ ప్రయోజనాలకు ఇది అదనం.’’ అని ఎల్జీ సిన్హా తెలిపారు.