జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రత దళాలు, పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రతి రోజు ఏదో ఒకప్రాంతంలో ఉగ్రవాదులను మట్టుపెడుతున్నారు.
ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌లో ఈఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు 177 మంది ముష్కరును అంతమొందించామని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ ప్రకటించారు. గత ఎనిమిది నెలల్లో ఒక్క శ్రీనగర్ ప్రాంతంలో నిర్వహించిన ఏడు ఆపరేషన్లలో 16 మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు.
అదేవిధంగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 72 ఆపరేషన్లు నిర్వహించామని చెప్పారు. ఈరోజు ఉదయం శ్రీనగర్‌లోని బాతామలూ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
శ్రీనగర్‌లో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. శ్రీనగర్‌లోని బటమలూ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఫిర్దౌసాబాద్ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ కూంబింగ్ నిర్వహించింది.
ఆ సమయంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణలో భాగంగా ఆర్మీ కూడా ఎదురుకాల్పులకు దిగింది. భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో కూంబింగ్ కాస్తా ఎన్‌కౌంటర్‌గా మారింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందగా, కౌన్సర్ రియాజ్ అనే మహిళ కూడా మృతి చెందింది.
కాగా.. ఈ కాల్పుల్లో ఇద్దరు సిఆర్‌పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చామని, కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వారు తెలిపారు.
More Stories
రైలును పట్టాలు తప్పించేందుకు మరోసారి కుట్ర
మెరీనా బీచ్ వద్ద ఎయిర్ షోలో తోక్కిసలాట.. ఐదుగురు మృతి
ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్లకే శబరిమల అయ్యప్ప దర్శనం