కంగనాకు మద్దతుగా తెలంగాణ కర్ణిసేన

కంగనాకు మద్దతుగా తెలంగాణ కర్ణిసేన

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ వివాస్పద మృతిపై నటి కంగనా రణౌత్ స్పందిస్తున్న తీరు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ సవాల్ గా మారింది. దీంతో కంగనా పై కక్షపూరితంగా మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆమె అభిమానులు మండిపడుతున్నారు. 

సుశాంత్ మరణంపై కంగనా వ్యవరిస్తున్న తీరు బాలీవుడ్ లో కలకలం సృష్టిస్తోంది. ఈ తరుణంలో కంగనాకు కొన్ని సంఘాలు, అభిమానులు మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా శ్రీ రాష్ట్రీయ రాజపుత్ కర్ణి సేన తెలంగాణ శాఖ కార్యకర్తలు కంగనాకు మద్దతు తెలిపారు. 

హైదరాబాద్ బేగంబజార్ లో ఆ సంఘం నాయకులు కంగనాకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. కంగనా పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డ నేతలు ఆమెపై వివాస్పద వ్యాఖ్యలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్  దిష్టిబొమ్మను దహనం చేశారు. 

మహిళలకు మద్దతుగా ఉండాల్సిన ప్రభుత్వం కంగనా పై కక్షపూరితంగా వ్యవరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన ప్రభుత్వం వెంటనే కంగనాకు క్షమాపణ చెప్పి కూల్చివేసిన ఆమె కార్యాలయాన్ని తిరిగి నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. 

లేనిపక్షంలో కర్ణి సేన దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామని కర్ణిసేన తెలంగాణ శాఖ నేతలు ఠాకూర్ సతీష్ సింగ్, రాజు సింగ్ హెచ్చరించారు.