సుప్రీం ఆదేశంపై జగన్ శిబిరంలో వణుకు!

నేర చరితులైన ప్రజాప్రతినిధుల వివరాలను వెంటనే అందించాలంటూ హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశిండంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శిబిరంలో వణుకు ప్రారంభమైన్నట్లు చెబుతున్నారు. స్వయంగా జగన్ తో పాటు, పార్టీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సహితం తీవ్రమైన కేసులు ఎదుర్కొంటు ఉండటమే అందుకు కారణం. 
 
వైసీపీ నేరగాళ్లకు అడ్డాగా మారిందని ప్రధాన ప్రతిపక్షం టిడిపి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న 50 మందికి నేర చరిత ఉందని, వాటిలో తొమ్మిది సీరియస్ క్రిమినల్ కేసులు, మంత్రులపై క్రిమినల్ కేసులు, ఏడుగురు ఎంపీలపై మహిళల్ని అత్యాచారం చేసిన కేసులు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
 
జగన్ తదితరులపై సిబిఐ నమోదు చేసిన 11 అక్రమార్జన కేసుల విచారణ కోర్ట్ లో నత్తనడక నడుస్తుండటం ఈ సందర్భంగా సుప్రీం కోర్ట్ దృష్టికి వస్తే విచారణను వేగవంతం చేయమని సుప్రీం కోర్ట్ ఆదేశించే అవకాశాలు లేకపోవచ్చని ఆందోళన చెందుతున్నారు. 
 
వచ్చే ఎన్నికల వరకు సీబీఐ ప్రత్యేక కోర్ట్ లో విచారణ ముందుకు సాగకుండా వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులకు బ్రేక్ పడే అవకాశం ఉందా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. 
 
ప్రతి శుక్రవారం జగన్ కోర్ట్ కు హాజరు కాకుండా ఉండడంతో కేసు విచారణ ముందుకు సాగడం లేదని ప్రధానంగా ఆరోపణలు వెలువడుతున్నాయి. గతంలో ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల విచారణను సంవత్సరం లోపుగా పూర్తి చేయాలని గతంలో సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీచేసింది. 
 
అయితే ఎనిమిది ఏళ్లయినా జగన్ పై కేసుల విచారణ ముందుకు సాగడం లేదు. ఈ విషయంలో సుప్రీం కోర్ట్ నిర్దిష్ట ఆదేశాలు ఇస్తే ఏర్పడగల పరిష్టితుల గురించి అంతర్గతంగా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.