సెంట్రల్ వర్సిటీల్లో హెచ్‌సీయూకు 2వ ర్యాంక్

దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థలలో  2020 సంవత్సరానికి ర్యాంకులను ఔట్ లుక్ మ్యాగజైన్ ప్రకటించింది. దీంట్లో టాప్25 సెంట్రల్ యూనివర్సిటీల్లో జేఎన్‌‌యూ మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కి రెండోస్థానం దక్కింది. ఓవరాల్ వర్సిటీల కేటగిరీ (టాప్–75)లోనూ హెచ్సీయూ 5వ స్థానంలో నిలిచింది. ఉస్మానియా యూనివర్సిటీకి 23వ ర్యాంకు దక్కింది. 

రాష్ట్ర స్థాయి యూనివర్సిటీ కేటగిరీ (టాప్–70)లో ఉస్మానియా  10వ స్థానంలో నిలిచింది. టెక్నికల్ వర్సిటీల కేటగిరీ (టాప్–23)లో ఐఐఐటీ హైదరాబాద్ 11, ఐఐటీ హైదరాబాద్14వ స్థానంలో నిలిచాయి. అకడమిక్, రీసెర్చ్ ఎక్స్‌‌లెన్స్, ప్లేస్‌మెంట్స్, ఇన్‌ఫ్రాస్ర్టక్చర్, అడ్మిషన్లు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. 

సెంట్రల్ వర్సిటీల్లో హెచ్సీయూ రెండో స్థానంలో నిలవడం పట్ల ఆ వర్సిటీ వీసీ అప్పారావు హర్షం వ్యక్తం చేశారు.