బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి సందర్భంగా  డ్రగ్స్ కేసులో ఇప్పటికే అరెస్టయిన రియా చక్రవర్తి నార్కోటిక్స్ అధికారుల విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించింది. దానితో  బాలీవుడ్ డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ను తాకింది.

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఫ్యాషన్ డిజైనర్ సిమ్మోన్ ఖంబట్టాలకు కూడా డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలున్నట్లు రియా బాంబు పేల్చింది. ఈ ముగ్గురూ తనతో, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి డ్రగ్స్ తీసుకున్నారని రియా తెలిపింది.

వీరిలో ఒక హీరోయిన్ సుశాంత్‌కు స్నేహితురాలని, మరో ఇద్దరు తనకు స్నేహితులని రియా చెప్పినట్లు తెలుస్తున్నది. బాలీవుడ్ తారలలో 80 శాతం మంది డ్రగ్స్‌ తీసుకుంటారని చెప్పి రియా అధికారులకు షాక్ ఇచ్చింది.

రియా ఇచ్చిన సమాచారం మేరకు 25 మంది ప్రముఖ బాలీవుడ్ తారలను ఎన్‌సిబీ అధికారులు విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్‌సిబీ అధికారుల విచారణలో రియా సుశాంత్ కోసం డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఒప్పుకుంది.

అంతేకాకుండా సుశాంత్ ఆర్థిక వ్యవహారాలు కూడా చూసేదని తెలిపింది. శామ్యూల్ మిరాండా, దీపేశ్ సావంత్మ, షోయిక్ చక్రవర్తిలకు డ్రగ్స్,  ఆర్ధిక లావాదేవీల గురించి రియా సూచనలు చేసినట్లు తెలిపింది.