
భారత్-చైనా సరిహద్దులో చైనా సైనికుల చేతికి చిక్కిన అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యువకులను చైనా శుక్రవారం అప్పగించింది. చైనా సరిహద్దులో వీరిని భారత సైన్యానికి అప్పగించింది.
అపహరణకు గురయ్యారని భావిస్తున్న అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యువకుల జాడ తెలిసిందని, వారిని చైనా శుక్రవారం అప్పగిస్తానని తెలిపిందని ఇటీవల కేంద్ర సహాయ మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఆ ఐదుగురు భారతీయ పౌరులను చైనా విడిచిపెట్టింది.
ఆ ఐదుగురు అడవిలో వేటకు వెళ్లి పొరపాటుగా వాస్తవాధీన రేఖను దాటినట్లు భారత ఆర్మీ ప్రకటించింది. శుక్రవారం ఉదయం కిభిథు సరిహద్దు పోస్టు గుండా భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌కు ఆ ఐదుగురిని భారత సిబ్బంది తీసుకొచ్చారు. వారితో పాటు అడవిలోకి వెళ్లిన మరో ఇద్దరు ఈ విషయాన్ని వారి కుటుంబాలకు తెలియజేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
అనంతరం ఇరు దేశాల మధ్య చర్చలు జరిగి వారిని విడిచిపెట్టడానికి అంగీకరించారు. మొదట తమకు వారి జాడ గురించి తెలియదన్న చైనా అనంతరం వారు తమ వద్దే ఉన్నట్లు ప్రకటించి విడుదల చేసింది. చైనా సైన్యం విడుదల చేసిన యువకులను తోచ్ సింగ్కం, ప్రసాత్ రింగ్లింగ్, డోంగ్టు ఎబియా, తనూ బేకర్, న్గారు దిరిగా గుర్తించారు.
More Stories
ఈజిప్ట్ ఆలయాల్లో వేలాది పశువుల పుర్రెలు
అమెరికాలో భారత జర్నలిస్ట్పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి
నన్ను అరెస్ట్ చేస్తే అమెరికాకు విపత్తు … ట్రంప్ హెచ్చరిక