పసిఫిక్‌ మహా సముద్రంపై  లా నినా  

పసిఫిక్‌ మహా సముద్రంపై  లా నినా  
పర్యావరణంలో విపరీత మార్పులకు కారణమయ్యే లా నినా పసిఫిక్‌ మహా సముద్రంపై ఏర్పడిందని అమెరికా పర్యావరణ విభాగం ధ్రువీకరించింది. భూమిపై విస్తారమైన జలభాగమైన పసిఫిక్‌ మహాసముద్ర ఉరితల జలాలు చల్లబడిపోవటాన్నే లా నినా అంటారు. 
 
దీని కారణంగా అమెరికా ఖండాలు, ఆస్ట్రేలియాలో ప్రకృతి విపత్తులు తలెత్తుతాయి. కొన్ని ప్రాంతాల్లో వాతావరణం పొడిబారి భారీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. లా నినా వల్ల అట్లాంటిక్‌ మహాసముద్రంలో అసాధారణ స్థాయిలో తుఫాన్లు పుడుతాయి. 
 
‘మేం ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నాం. ఇప్పుడు లా నినా నవంబర్‌, డిసెంబర్లలో కూడా వాతావరణాన్ని అగ్నిమయం చేయనున్నది’ అని వెదర్‌ టైగర్‌ ఎల్‌ఎల్‌సీ అధ్యక్షుడు రేయాన్‌ ట్రచెలట్‌ ఆవేదన వ్యక్తంచేశారు. లా నినా వల్ల అమెరికా పశ్చిమ భాగంలో కరువు ఏర్పడుతుంది. దీని ప్రభావం ఇప్పటికే మొదలైందని రేయాన్‌ తెలిపారు.  
మరోవంక, ఈ ఏడాది రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగానే వర్షాన్నిచ్చాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. రుతుపవనాల ముగింపు కూడా సాధారణం కంటే మెరుగ్గానే ఉంటుందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర  తెలిపారు.
 
ఆగస్టుతో పోల్చితే సెప్టెంబర్‌లో వర్షాలు తగ్గినప్పటికీ మరికొద్ది రోజుల్లో మళ్లీ పుంజుకుంటాయన్నారు. ఈ ఏడాది మొత్తంగా చూస్తే వర్షపాతం 102 శాతం ఉంటుందని వెల్లడించారు.