దేవాలయాల పరిరక్షణకు నర్సాపురం ఎంపీ దీక్ష

ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాల పై  జరుగుతున్న  వరుస  దాడులకు నిరసనగా  నర్సాపురం  పార్లమెంట్  సభ్యులు   కె. రఘురామకృష్ణంరాజు రేపు 8 గంటల పాటు గాంధేయ పద్దతిలో నిరసన దీక్ష తలపెట్టారు.  ఈ  దీక్ష  కార్యక్రమంను శుక్రవారం   ఉదయం  9 గంటల నుండి  సాయంత్రం  5  గంటల  వరకు ఢిల్లీ లోని తన నివాసంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. 
 
కోవిద్   మహమ్మారిని  దృష్టిలో  వుంచుకొని  కోవిద్  నిబంధనలు  పాటిస్తూ  ఈ  దీక్షా  కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. దేవాలయాలపై  దాడులు జరగకుండా వాటిని  నివారించడానికి  చర్యలు  తీసుకోవాలని  ఆయన ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 
 
ఇప్పటి వరకు జరిగిన దాడులకు  పాల్పడినవారిపై  కఠిన  చర్యలు  తీసుకోవాలని, ఈ సంఘటనల పై ఉన్నతస్థాయిలో దర్యాప్తు  జరిపించాలని  ముఖ్యమంత్రి  వై. యస్. జగన్  మోహన్  రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. 
 
దేవాలయాలు పరిరక్షణకు చేపడుతున్న ఈ పవిత్ర  దీక్షా కార్యక్రమంకు  కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా  ప్రతీ  ఒక్కరు  నైతిక మద్దతు  ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేయారు.