8 లక్షల కుపైగా పనిదినాలు కల్పించిన రైల్వేలు 

గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ పథకం కింద బిహార్, ఝూర్ఖండ్, మధ్య ప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్ ,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో 8,09,046 పనిదినాలను భారతీయ రైల్వే కల్పించింది. వలస కార్మికుల కోసం ఆయా రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాల కల్పన కోసం ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును కేంద్ర  రైల్వేలు,వాణిజ్య ,పరిశ్రమల మంత్రి  పీయూష్ గోయల్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
ఆయా రాష్ట్రాల్లో సుమారు 164 రైల్వే ప్రాజెక్టులను అమలు పరుస్తున్నారు. ఇందుకోసం 4 సెప్టెంబర్ 2020 నాటికి 12,276 మంది కూలీలు పనిచేయగా వారికి చెల్లింపుల కోసం రు.1,631.80 కోట్ల నిధులను విడుదల చేసారు. ప్రాజెక్టుల్లో ఈ పథకం కింద వివిధ రకాల పనులను గుర్తించి అమలు పరుస్తున్నారు.
అవి లెవల్ క్రాసింగులను కలిపే రోడ్డులను నిర్మించడం వాటి సంరక్షణ ,రైల్వే పట్టాల వెంట నీరు నిలవ ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని శుభ్రపరచడం వంటి కార్యక్రమాలు చేయడం. రైల్వే స్టేషన్లను కలిపే అప్రోచ్ రోడ్లను నిర్మాణం, వాటి సంరక్షణ, ఇప్పటికే ఉన్న రైలు కట్టలను బాగుచేయడం లేదా వెడల్పు చేయడం ,రైల్వే స్థలాల సరిహద్దుల వెంట మొక్కల పెంపకం ,ప్రస్తుతం ఉన్నకట్టలు, వంతెలనల సంరక్షణ.
కొవిడ్-19 కారణంగా భారీగా స్వస్థలాలకు చేరిన వలస కూలీల ఉపాధి మరియు గ్రామీణ ఉపాధి కార్యక్రమం గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 20 జూన్ 2020న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం క్రింద గ్రామాల్లో మన్నికైన భవనాల నిర్మాణం కోసం రు. 50,000 కోట్లు ప్రకటించారు
ప్రధాన మంత్రి.  బిహార్, ఝూర్ఖండ్, మధ్య ప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్ , ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోని 116  జిల్లాల్లో  వలస కార్మికుల కోసం 25 వర్గాల క్రింద 125రోజుల పనిదినాలను కల్పించడం జరుగుతుంది. ఈ పథకం క్రింద ప్రభుత్వ పనులను కూడా చేర్చి వాటి చెల్లింపుల కోసం రు.50,000 కోట్లు కేటాయించారు.