చైనా నుంచి ‘విటమిన్‌ సీ’ డంపింగ్ పై దర్యాప్తు

వివిధ ఔషధాల తయారీలో ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు ఉపయోగించే విటమిన్‌ సీ చైనా నుంచి  డంపింగ్‌ జరిగిందనే ఆరోపణలపై భారత్‌ దర్యాప్తు ప్రారంభించింది. దీనిపై విచారణ జరపాలని దేశీయ తయారీదారు బజాజ్ హెల్త్‌కేర్ లిమిటెడ్, వాణిజ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తు విభాగం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమెడీస్‌ (డీజీటీఆర్‌)కు ఫిర్యాదు చేసింది.  

చైనా పీఆర్ నుంచి విటమిన్ సీ డంపింగ్ చేయడం వల్ల దేశీయ పరిశ్రమపై ప్రభావం పడిందని బజాజ్‌ హెల్త్‌కేర్‌ పేర్కొంది.  దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకం విధించాలని అభ్యర్థించినట్లు డీజీటీఆర్ నోటిఫికేషన్‌లో తెలిపింది. 

రఖాస్తుదారులు సమర్పించిన ప్రాధమిక సాక్ష్యాల ఆధారంగా దర్యాప్తును ప్రారంభిస్తున్నట్లు డీజీటీఆర్‌ వెల్లడించింది. చైనా నుంచి విటమిన్ సీ డంపింగ్‌ జరిగిందా? దాని ప్రభావం దేశీయ సంస్థలైన పడిందా? అనేది దర్యాప్తులో తేలుస్తామని పేర్కొంది. 

ఒకవేళ డంపింగ్‌ జరిగినట్లు తేలితే దిగుమతులపై యాంటీ డంపింగ్‌ సుంకం విధిస్తామని, ఇది దేశీయ పరిశ్రమలకు కలిగిన నష్టాన్ని పూడుస్తుందని తెలిపింది. డీజీటీఆర్‌ సిఫార్సు చేసిన సుంకాన్నే ఆర్థిక శాఖ విధిస్తుంది. 

కాగా, దర్యాప్తు కాలం ఏప్రిల్ 2019-మార్చి 2020. ఏప్రిల్ 2016-19 కాలపు డేటాను కూడా పరిశీలిస్తామని డీజీటీఆర్‌ తెలిపింది.