క‌ల‌హండిలో న‌లుగురు మావోయిస్టులు హ‌తం

ఎదురు కాల్పుల్లో న‌లుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు. ఈ ఘ‌ట‌న ఒడిశా రాష్ట్రం క‌ల‌హండి జిల్లాలోని క‌ల‌హండి-కంద‌మాల్ సరిహద్దు బండ‌రంగి సిర్కి అట‌వీ ప్రాంతంలో నేడు చోటుచేసుకుంది. 
 
భ‌ద్ర‌తా బ‌ల‌గాల సిబ్బందికి, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో న‌లుగురు మావోయిస్టులు మృతిచెంద‌గా ఒడిశా స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూప్‌కు చెందిన ఓ జ‌వాను గాయ‌ప‌డ్డాడు. గాయ‌ప‌డ్డ జ‌వాన్‌ను చికిత్స నిమిత్తం త‌ర‌లించారు.
 విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు డిస్ట్రిక్ట్ వాలంట‌రీ ఫోర్స్‌(డీవీఎఫ్‌)తో క‌లిసి ఎస్‌వోజీ మంగ‌ళ‌వారం నుంచి కూంబింగ్ ఆప‌రేష‌న్‌ను చేప‌ట్టాయి.
 
ఈ ఉద‌యం 11 గంట‌ల‌కు ఇరువ‌ర్గాల మ‌ధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. నాలుగున్న‌ర గంట‌లపాటు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. సంఘ‌ట‌నా స్థ‌లంలో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు పోలీసు ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు.