సివిల్ సర్వీసెస్ సంస్కరణ ”మిషన్ కర్మయోగి”

ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలకు నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రధానమంత్రి పర్యవేక్షణలో సివిల్ సర్వీసెస్ నిర్వహించనున్నారు.

ఈ మేరకు సివిల్ సర్వీసెస్ ఉద్యోగ నియామక సంస్కరణల కోసం తీసుకువచ్చిన ”మిషన్ కర్మయోగి” కార్యాచరణకు కేబినెట్ బుధవారం అమోదం తెలిపింది. 

సెక్ష‌న్ ఆఫీస‌ర్ల నుంచి సెక్ర‌ట‌రీల వ‌ర‌కు దృఢ‌మైన అధికారుల‌ను తీర్చిదిద్దేందుకు ఈ మిష‌న్ చేప‌ట్టారు. శ‌క్తివంత‌మైన‌ ప్ర‌జాసేవ‌కుల‌ను త‌యారు చేసే విధంగా కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు. మాన‌వ వ‌న‌రుల శాఖ‌లో ఇది అతిపెద్ద సంస్క‌ర‌ణ అని కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ తెలిపారు.

క‌ర్మ‌యోగి మిష‌న్ కోసం ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న హెచ్ఆర్ మండ‌లి ఏర్పాటు చేస్తారు. దీంట్లో కొంద‌రు కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రులు ఉంటారు.  ఇంకా నిష్టాత ప్రొఫెస‌ర్లు, విశ్వ‌నేతలు కూడా హెచ్ఆర్ కౌన్సిల్‌లో ఉంటారు. 

భార‌తీయ సాంప్ర‌దాయ పనితీరును అవ‌లంబిస్తూనే ప్రపంచ దేశాల్లో ఉన్న ఉత్త‌మ విధానాల‌ను కూడా స్వీక‌రించే విధంగా సివిల్ స‌ర్వెంట్ల‌ను తీర్చిదిద్ద‌నున్నారు.  మిష‌న్ క‌ర్మ‌యోగిలో భాగంగా భార‌తీయ సివిల్ స‌ర్వెంట్ల‌ను భ‌విష్య‌త్తుకు త‌గిన రీతిలో త‌యారు చేస్తామని జావెదకర్ పేర్కొ‌న్నారు.  

సృజ‌నాత్మ‌కంగా, స‌మ‌గ్రంగా, క‌ల్ప‌నాత్మ‌కంగా, ఇన్నోవేటివ్‌గా, ప్రొఫెష‌న‌ల్‌గా, ప్ర‌గ‌తిశీలంగా, ఎన‌ర్జిటిక్‌గా, పార‌ద‌ర్శ‌కంగా, టెక్నాల‌జీ తెలిసి ఉండే విధంగా సివిల్ స‌ర్వెంట్ల‌ను రూపొందించ‌డ‌మే మిష‌న్ ఉద్దేశ్యం.