పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలుండవ్ 

పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలుండవ్ 

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ‘జీరో అవర్’ కూడా కేవలం అరగంట మాత్రమే ఉంటుందని ప్రకటించింది. 

సెప్టెంబర్‌ 14వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు అక్టోబర్‌ 1వ తేదీ వరకు జరుగుతాయి.  కరోన నేపథ్యంలో ఉదయం రాజ్యసభ, మధ్యహ్నం లోక్‌సభ సమావేశాలు జరుగుతాయి. 

సమావేశాలు తొలిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లోక్‌సభ జరుగుతుంది. మిగతా రోజుల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు లోక్‌సభ జరుగుతుంది. 

అలాగే రాజ్యసభ సమావేశాలు తొలిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతాయి. మిగతా రోజుల్లో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు రాజ్యసభ జరుగుతుంది.

దీనిపైర్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ఈ నిర్ణయం లోకసభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ తీసుకున్న నిర్ణయమని తెలిపారు. కోవిడ్ కారణంగానే ఇలా చేయాల్సి వచ్చిందని వివరించారు.

అయితే వర్షాకాల సమావేశాలు సజావుగా సాగడానికి ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలను ప్రారంభించింది. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన నేతలతో కేంద్ర మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ ఫోన్లో సంభాషించారు. సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని రాజ్‌నాథ్ అభ్యర్థించారు.