
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురష్కరించుకుని బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
వారితో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
అంతకు ముందు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్ 11వ వర్ధంతి సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.
‘‘ నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ, ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నార’’ని పేర్కొన్నారు
More Stories
పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం
న్యాయస్థానాల పరిధిలో హైకోర్టు తరలింపు అంశం
బీజేపీలో చేరిన కీలక జనసేన నేత