మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి లొంగుబాటు?

మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. వయసు పైబడిన రీత్యా గణపతి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే లక్ష్మణరావు లొంగి పోవడానికి రంగం సిద్దమైన్నట్లు తెలుస్తున్నది. 

తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ జిల్లా సారంగాపూర్ కు చెందిన గణపతి దాదాపు మూడు దశాబ్దాల పాటు నక్సల్స్  కార్యకలాపాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. సుదీర్ఘ కాలం పాటు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా పని చేసిన గణపతి నవంబర్, 2018లో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు.

వయస్సు, అనారోగ్యం కారణంగా ఆయన స్థానంలో నంబాల కేశవరావు బాధ్యతలు స్వీకరిచారు. దేశంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టుగా ఉన్న లక్ష్మణరావు తలపై ప్రభుత్వం రూ 1.5 కోట్ల  రివార్డు కూడా ప్రకటించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కు సన్నిహితుడైన ఒక టి ఆర్ ఎస్ నేత ద్వారా రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తున్నది.

పీపుల్స్ వార్ గ్రూప్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య ప్రోధ్బహలంతో ఈ ఉద్యమంలో ప్రవేశించిన గణపతి, ఆయనకు వ్యతిరేకంగా ఒక వర్గం ఏర్పాటు చేసుకొని, ఆయనను, ఆయన అనుచరులను పార్టీ నుండి బైటకు పంపి వేయడమే, పోలీస్ కాల్పులలో చనిపోయేటట్లు చేయడమో చేయడం ద్వారా మొత్తం నాయకత్వాన్ని హస్తగతం చేసుకున్నాడు.

చాలాకాలంగా ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్ లలో కార్యక్రమాలు సాగిస్తున్నా అక్కడ పోలీసులకు లోంగే సాహసం చేయలేక, కేసీఆర్ ను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో పలువురు మాజీ మావోయిస్టులు కీలక పదవులలో ఉండడంతో అందుకు మార్గం ఏర్పడినట్లు కనిపిస్తున్నది.