టాలీవుడ్ పార్టీ లలో కూడా డ్రగ్స్

బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకుండా పార్టీలు జరగవన క్వీన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పడు సినీ పరిశ్రమలో సంచలనంగా మారగా, టాలీవుడ్ సహితం అందులో వెనుకపాడలేదంటూ మరో నటి చేసిన వాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 
 
బాలీవుడ్ లో 99 శాతం మంది నటీనటులు డ్రగ్స్ తో పార్టీలు చేసుకుంటారని కంగన చెప్పడంతో ఇప్పడు అగ్రనటులు ఆందోళనకు గురవుతున్నారు. యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తర్వాత బాలీవుడ్ లో నెపొటిజం, డ్రగ్స్ వాడకంపై చర్చ జరుగుతోంది. బాలీవుడ్ లో డ్రగ్స్ వాడే వారి గుట్టు బయట పెడుతానని కూడా కంగనా తేల్చి చెప్పింది. 
 
ఈ క్రమంలో నటి, బిజెపి నాయకురాలు మాధవీలత స్పందించారు. టాలీవుడ్ లో కూడా డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవని మాధవీలత స్పష్టం చేశారు. టాలీవుడ్ పై  తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ అధికారులు దృష్టి పెట్టాలని ఆమె కోరారు. 
 
సుశాంత్ కేసులో ఎన్ సిబిఐ అడుగుపెట్టడాన్ని ఆమె స్వాగతిస్తూ అదేవిధంగా టాలీవుడ్ పై కూడా  దృష్టి పెట్టాలని మాధవీలత కోరారు. బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం అధికంగా ఉన్నమాట నిజమేనని, టాలీవుడ్ లో కూడా డ్రగ్స్ వాడకం అధికంగానే ఉందని ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. 
 
టాలీవుడ్ లో డ్రగ్స్ వాడే వారిపై అధికారులు విచారణ జరిపితే, చాలా విషయాలు బయటకు వస్తాయని ఆమె తేల్చి చెప్పారు. ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం, పోలీసులు ప్ర‌త్యేక‌మైన దృష్టిపెట్టాల‌ని చెబుతూ టాలీవుడ్ స్టార్స్‌పై పీత‌క‌న్ను కాకుండా సీరియ‌స్ దృష్టి పెట్టాలని ఆమె కోరారు. 
 
గతంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులను తెలంగాణ అధికారులు డ్రగ్స్ వాడకం, పంపిణి ఆరోపణలపై విచారణ జరిపి కలకలం సృష్టించారు. అయితే ఆ కేసును ఆ తర్వాత నీరుకార్చడం తెలిసిందే.