ఎపిలో 4 లక్షల మార్కు దాటిన కరోనా కేసులు

ఎపిలో కరోనా వైరస్‌ పంజా విసురుతూనే ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసులు నాలుగు లక్షలు దాటాయి. అంతేకాకుండా వరుసగా నాలుగో రోజు పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 
 
గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,526 పాజిటివ్‌ కేసులు నమోదవ్వడంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 4,03616కు శుక్రవారం చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారితో 81 మంది మరణించడంతో రాష్ట్రవ్యాప్తంగా మరణాల సంఖ్య 3,714కి చేరుకుంది. 
 
ప్రస్తుతం 96,191 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంతుతుండగా 3,03,711 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 8,463 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. శుక్రవారం ఒక్కరోజే 61,331 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు మొత్తం పరీక్షల సంఖ్య 35,41,321కి చేరుకుంది.