టిక్‌టాక్ సిఇఓ రాజీనామా

ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్‌పై వ్యతిరేకత పెరిగిపోవడంతో సంస్థ సిఇఓ కెవిన్ మాయర్ రాజీనామా చేశారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి టిక్‌టాక్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కెవిన్ తన పదవికి రాజీనామా చేశారు.

‘ఇటీవలి కాలంలో రాజకీయ వాతావరణం వేగంగా మారిపోయింది. ప్రపంచ స్థాయిలో వ్యాపారానికి అనువైన మార్పులను కార్పొరేట్ వ్యవస్థలో చేశాను. నేను వైదొలగుతున్నాను’ అని ఉద్యోగులకు రాసిన లేఖలో కెవిన్ పేర్కొన్నట్లు ఆంగ్ల న్యూస్ చానల్ సిఎన్‌ఎన్ తెలిపింది.

‘ప్రస్తుతం ఉన్న వ్యతిరేకతకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాను. నేను మీ అందరిని విడిచి వెళ్లిపోవడం బాధాకరంగా ఉంది’ అని కెవిన్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. కెవిన్ గతంలో డిస్నీలో పని చేశారు. నాలుగు నెలలు క్రితమే టిక్‌టాక్ ఆయనను సిఇఓగా నియమించింది.

అమెరికా రెగ్యురేటరీలకు అనుగుణంగా యాప్‌లో మార్పులు చేసి ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళతారని సంస్థ భావించింది. కానీ ట్రంప్ సర్కార్ టిక్‌టాక్‌పై దాడిని మరింత పెంచింది. మరోపక్క నిషేధం నుంచి తప్పించుకోవాలంటే అమెరికాలో వ్యాపారాన్ని విక్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో కెవిన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.