విద్యార్థులు, తల్లితండ్రుల కోర్కె మేరకే పరీక్షలు 

 
జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పందిస్తూ తల్లిదండ్రుల నుంచి, విద్యార్థుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని తెలిపారు. ఇప్పటికే 80 శాతం మంది విద్యార్థులు ఇప్పటికే అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్నారని ఆయన వెల్లడించారు. 
 
 ‘‘పరీక్షలు నిర్వహించాలంటూ తమపై అదే రకంగా ఒత్తిడి పెంచుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటున్నారు. జేఈఈ, నీట్ ఎందుకు నిర్వహించడం లేదని మమ్మల్ని నిలదీస్తున్నారు. విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇంకెన్ని రోజులు చదవాలని వాళ్ల మనస్సుల్లో నాటుకుపోయింది’’ అని రమేశ్ పోఖ్రియాల్ పేర్కొన్నారు.

8.58 లక్షల మంది ఈ పరీక్షల నిమిత్తమై తమ పేర్లను నమోదు చేసుకున్నారని, `7.25 లక్షల మంది అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును కూడా డౌన్‌లౌడ్ చేసుకున్నారని తెలిపారు. 

మరోవైపు జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సెప్టెంబర్ 1నుంచి జేఈఈ, 13 నుంచి నీట్ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే అడ్మిట్ కార్డులు జారీ అయ్యాయి.