సూపర్ యాప్‌నకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో లేనప్పటికీ, ఫ్యాషన్ షాపింగ్ యాప్ టాటా క్లిక్, కిరాణా ఇ-స్టోర్ స్టార్‌క్విక్ ఆన్‌లైన్, ఎలక్ట్రానిక్స్ ప్లాట్‌ఫాం క్రోమా ద్వారా ఇప్పటికే సేవలను అందిస్తున్న టాటా గ్రూప్, వీటన్నింటి సమ్మితంగా, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఒక కొత్త సూపర్ యాప్ ను రూపొందించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
సూపర్ యాప్ ద్వారా ఫుడ్, కిరాణా, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ లాంటి వాటితో పాటు ఇతర పేమెంట్ సేవలను కూడా అందుబాటులోకి తేనుంది. ఇదొక సూపర్ యాప్. ఇందులో పలు యాప్స్ ఉంటాయి.
డిజిటల్ సేవల్లో తమకు అపారమైన అవకాశాలున్నాయని చంద్రశేఖరన్ వెల్లడించారు. భారతదేశంలోఅనేక కోట్లాదిమంది వినియోగదారులను అనుసంధానిస్తూ వారికి సరళమైన ఆన్‌లైన్ అనుభవాన్ని అందించనున్నామని పేర్కొన్నారు.
కాగా గోల్డ్‌మన్ సాచ్ నివేదిక ప్రకారం, 2030 నాటికి భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.5 శాతాన్ని డిజిటల్ వ్యాపారం ఆక్రమించనుంది. సుమారు15 రెట్లు పుంజుకుని 300 బిలియన్ డాలర్లను తాకుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో టాటా గ్రూపు తాజా వ్యూహాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
More Stories
ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్లో ఈడీ సోదాలు
ఎస్బీఐలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు
రూ.1,800 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం