స్వచ్ఛ సర్వేక్షణ్ నగరాలలో అడ్రస్ లేని తెలంగాణ

కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 నగరాలలో ఈ సారి తెలంగాణ వెనుకబడిపోయింది. మొదటి 20 నగరాలలో తెలంగాణలో ఒక నగరం కూడా రాలేకపోయింది.  స్వయంగా పట్టణాభివృద్ధి శాఖ చేబడుతూ, హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తామని అంది కలల ప్రపంచం సృష్టిస్తున్న కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ప్రగల్భాలకు మాత్రమే పరిమితమైన్నట్లు స్పషమైనది. 

హైదరాబాద్  కు  జాతీయ స్థాయిలో 23వ చోటు లభించింది. హైదరాబాద్ లో కరోనా ఉధృతికి, పరిశుధ్యంలో వెనుకబడి ఉండడానికి సంబంధం ఉన్నట్లు భావించవలసి వస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిపాలనను కేసీఆర్ ప్రభుత్వం గాలికి వదిలివేసిన్నట్లు స్పష్టం అవుతున్నది. 

అదే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు చెందిన రెండు సిటీలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.  వంద కన్నా తక్కువ మున్సి పాలిటీలున్న రాష్ట్రాల జాబితాలో స్వచ్ఛ రాష్ట్రం గా తెలంగాణ 8వ స్థానాన్ని దక్కించుకుంది. వంద కన్నా ఎక్కువ మున్సి పాలిటీలున్న రాష్ట్రాల విభాగంలో ఏపీ ఆరో ర్యాంకును సాధించింది.

పది లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో కరీంనగర్ కు 72, నిజామాబాద్ 133, వరంగల్ 144, మహబూబ్ నగర్ 200, రామగుండం 211, నల్గొండ 226, మిర్యాలగూడ 306, సూర్యాపేట 326, ఖమ్మం 329, ఆదిలాబాద్ 339వ ర్యాంకులో నిలిచాయి. 

25 వేల నుంచి 50 వేలలోపు జనాభా ఉన్న సౌత్ జోన్ పట్టణాల జాబితాలో మేడ్చల్ టౌన్‌‌​ క్లీనెస్ట్ సిటీగా నిలిచింది.  కంటోన్మెంట్ బోర్డుల్లో సికిం ద్రాబాద్ కంటోన్మెంట్ కు 31వ ర్యాంకు వచ్చింది.