`ఆధార్’  ఆధారంగా భీమా పాలసీలు 

`ఆధార్’  ఆధారంగా భీమా పాలసీలు 
బీమా కంపెనీలు తమ పాలసీలను అమ్ముకోవడానికి వ్యక్తుల ఆధార్ వివరాలను ఆధారంగా చేసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం  తెలిపింది. వ్యక్తుల ఆధార్ తీసుకుని, వారికి బీమా పాలసీలు అమ్మేందుకు 24 బీమా కంపెనీలకు అనుమతి ఇచ్చింది.  
 
 మనీలాండరింగ్ నిరోధం కోసం ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. బీమా కంపెనీలు, షెల్ కంపెనీలలోకి నిధులను కుమ్మరించడాన్ని నిరోధించేందుకు బీమా కంపెనీలకు ఈ అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నిర్ణయం వల్ల బీమా కంపెనీలు రియల్ టైమ్‌లో పనిచేయడానికి, ఖాతాదారుల గురించి ఎలక్ట్రానిక్ విధానంలో తెలుసుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా లావాదేవీల కోసం అయ్యే ఖర్చులు కూడా తగ్గుతాయి. 

ఈ అనుమతులు పొందిన బీమా కంపెనీలు: 

ఆదిత్య బిర్లా, అవివా లైఫ్, బజాజ్ అలియెన్జ్, భారతి ఏఎక్స్ఏ, చోళమండలం, టాటా ఏఐఏ లైఫ్, టాటా ఏఐజీ జనరల్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, యూనివర్సల్ సోంపో, ఎల్ఐసీ, మాగ్మా హెచ్‌డీఐ, మాక్స్ బూపా హెల్త్, నేషనల్ ఇన్సూరెన్స్, నవీ జనరల్ ఇన్సూరెన్స్, రహేజా, రిలయన్స్, శ్రీరామ్, స్టార్ హెల్త్, ఎడెల్వీజ్, గో డిజిట్, ఐసీఐసీఐ లొంబార్డ్, ఇఫ్కో టోకియో, లిబర్టీ, ఓరియెంటల్ ఇన్సూరెన్స్.