
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఆయన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని ఆయనకు వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ పేర్కొంది. కరోనా వైరస్ సోకిన ప్రణబ్ ముఖర్జీ గత పది రోజులుగా హాస్పిటల్లోనే ఉన్నారు.
ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని, కొత్తగా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకిందని, ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని, స్పెషలిస్టుల బృందం ఆయనకు చికిత్స చేస్తోందని ఆర్మీ హాస్పిటల్ తెలిపింది. కరోనా వైరస్ ప్రభావంతో 84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీ అగస్టు 10వ తేదీన హాస్పిటల్లో చేరారు.
తన తండ్రి ఆరోగ్యం బాగానే ఉందని కుమారుడు అభిజిత్ ప్రకటించిన కాసేపటికే ఆస్పత్రి వర్గాలు ఈ అప్‌డేట్‌ను విడుదల చేశాయి
More Stories
హిందూ రాష్ట్రంగా ప్రకటించి భారత్ ను కాపాడండి
మే 2న రాజీనామాకు సిద్ధం కండి మమతాజీ
కరోనాపై రెండో యుద్ధం టీకా ఉత్సవ్