ఏపీ జల దోపిడీపై కృష్ణ బోర్డు ఆక్షేపణ 

ఏపీ జల దోపిడీపై కృష్ణ బోర్డు ఆక్షేపణ 

కేటాయింపులకంటే అధికంగా కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ వినియోగిస్తోందని కృష్ణానదీ యాజమాన్యం బోర్డు ఆక్షేపించింది. తెలంగాణ రాష్ట్రం కేటాయింపులకంటే తక్కువగా ఉపయోగిస్తూ నీటివాటాలను సమర్థవంతంగా వినియోగించుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ అందుకు భిన్నంగా ప్రాజెక్టుల్లోంచి అధికంగా నీటిని తోడుకుంటుందని బోర్డు పేర్కొంది.

వివాదాలకు, ఆరోపణలకు తావివ్వకుండా ఆంధ్ర నింబంధనల మేరకు నీటిని ప్రాజెక్టులనుంచి తోడుకోవాలని సూచించింది. ఆగస్టు 5న ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పోతిరెడ్డి పాడుకు 9 టిఎంసిల విడుదలకు అనుమతి ఇస్తే 9.517 టిఎంసిల నీటిని విడుదల చేసిందని కృష్ణానదీ యాజమాన్యం బోర్డు స్పష్టం చేసింది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డి పాడుకు .517 టిఎంసిలు అధికంగా విడుదల చేసిందని తెలిపింది.

ఆంధ్ర ఇప్పటికైనా కేటాయింపుల మేరకే నీటిని వినియోగించుకోవాలని కృషా నాదీ బోర్డు  యాజమాన్యం స్పష్టం చేసింది. అలాగే ఇతరప్రాజెక్టుల వ్యవహారం కూడా ఇలాగా ఉందని పేర్కొంది. నాగార్జున సాగర్ నుంచి ఆగస్టు 10వరకు 4.286 టిఎంసిలను ఆంధ్ర వినియోగించిందని పేర్కొంది. అయితే నిబంధనలమేరకు నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ .121 టిఎంసిల నీటిని అధికంగా వినియోగించిందని బోర్డు తెలిపింది. 

తెలంగాణ నాగార్జునసాగర్ నుంచి కేటాయింపుల కంటే తక్కువగానే విడుదల చేసిందని కృష్ణానదీ యాజమాన్యంబోర్డు తెలిపింది. కేటాయింపులకు భంగం కలకుండా ఆంధ్ర వ్యవహరించాలని బోర్డు కోరింది.