కీలక మార్పులివే..
1.ప్రభుత్వ, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నాన్ గెజిటెడ్ పోస్టుల రిక్రూట్ మెంట్ కోసం వేర్వేరు పరీక్షలు అవసరం లేకుండా సింగిల్ ఆన్‌లైన్ సీఈటీకి హాజరైతే సరిపోతుంది.
2.సీఈటీలో సాధించిన మార్కులు ఫలితాలు ప్రకటించిన మూడేళ్ల వరకూ చెల్లుబాటులో ఉంటాయి.
3. తమ మార్కులు మెరుగుపరుచుకునేందుకు ప్రతి అభ్యర్థికి మరో రెండు అదనపు ఛాన్సులు ఉంటాయి. మూడింట్లో అధికంగా వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు.
4.ఎన్ఆర్ఏ ఇచ్చే సీఈటీ మెరిట్ లిస్ట్‌తో కాస్ట్-షేరింగ్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
5. ఇండియాలోని మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తరహాలోనే ఈ ఎన్ఆర్ఏ కూడా ఉంటుంది.
కాగా, గత ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఎన్ఆర్ఏ ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన అడ్వాన్స్ స్టేజ్‌లో ఉందని, త్వరలోనే దీనికి ఒక పూర్తిరూపం వస్తుందని గత జూన్ 25న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
More Stories
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన భగవత్
మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా గద్దలతో ‘ఈగల్ స్కాడ్’