ల‌ష్క‌రే తోయిబా క‌మాండ‌ర్ హ‌తం

జ‌మ్మూక‌శ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమ‌వారం ఉద‌యం నుంచి భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఉద‌యం ఇద్ద‌రు సీఆర్పీఎఫ్ జ‌వాన్లు, ఒక పోలీసు ప్రాణాలు కోల్పోయారు.

సాయంత్రం స‌మయానికి ఇద్ద‌రు ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాదుల‌ను బ‌ల‌గాలు మ‌ట్టుబెట్టాయి. వీరిలో ఒక‌రు క‌మాండ‌ర్ స‌జ్జ‌ద్ ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. పోలీసు పోస్టుపై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌ర‌ప‌డంతో బ‌లగాలు అప్ర‌మ‌త్త‌మై ఉగ్ర‌వాదుల ఆచూకీ కోసం కూంబింగ్ నిర్వ‌హించాయి.

హ‌త‌మైన ఉగ్ర‌వాదుల నుంచి ఏకే రైఫిల్‌తో పాటు రెండు పిస్తోల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మ‌రో ఉగ్ర‌వాది కోసం పోలీసుల కూంబింగ్ కొన‌సాగుతోంది.