బీహార్ లో ఆత్మనిర్భర్ భారత్ ప్రధాన అస్త్రం 

నూతన విద్యా విధానం (ఎన్ఈపీ), స్వయం సమృద్ధ భారతం (ఆత్మనిర్భర్ భారత్)ను బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రాలుగా  బిజెపి చేసుకొనున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండూ తమ పార్టీ కీలక అంశాలని బీజేపీ బీహార్ విభాగం అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ సంజయ్ జైశ్వాల్ వెల్లడించారు. 
 
 ‘బీహార్‌కు ఎన్‌ఈపీ చాలా కీలకమైంది. రాష్ట్ర ప్రజలు 8 ఏళ్లు తర్వాత సాంకేతిక విద్యను ప్రారంభిస్తారు. నైపుణ్యాభివృద్ధిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఎన్‌ఈపీ కింద తీసుకునే చర్యలు బీహార్‌ విద్యావిధానంలో కీలక మార్పులను తీసుకురానుంది’ అని జైశ్వాల్ చెప్పారు.

భూ సంబంధిత అంశాల కారణంలో రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలు నెలకొల్పడం సాధ్యం కావడం లేదని జైశ్వాల్ చెప్పారు. ఆ కారణంగా సూక్ష్మ, చిన్న, మీడియం తరహా పరిశ్రమలను ప్రమోట్ చేయడం చాలా ముఖ్యమని తెలిపారు. 

రాష్ట్రాభివృద్ధికి ముందుకు వచ్చే ఔత్సాహికులకు రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని తెలిపారు. స్వయం సమృద్ధ భారత్‌ విజయానికి స్వయం సమృద్ధ బీహార్‌ జత కావాలన్నారు. చిరూ న్న పరిశ్రమలకు అవసరమయ్యే మౌలిక వసతుల కోసం 1.5 లక్షల కోట్ల ప్యాకేజీని బీహార్‌కు ప్రత్యేకంగా ప్రధాని ప్రకటించారని జైశ్వాల్ గుర్తు చేశారు.