జమ్మూ కశ్మీర్ లో ఎట్టకేలకు 4జీ సేవలు  

జమ్మూ కశ్మీర్ లో ఎట్టకేలకు 4జీ సేవలు ప్రారంభమయ్యాయి. ముందుగా రెండు జిల్లాల్లో మాత్రమే ప్రయోగాత్మకంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి వీటిని పునరుద్ధరించారు. జమ్మూలోని గందేర్ బల్ జిల్లాలో, కశ్మీర్ లోని ఉదంపూర్ జిల్లాలో 4జీ సేవలు ప్రారంభమయ్యాయి.  

‘‘కశ్మీర్ లోని గందేర్‌బల్, జమ్మూ ప్రాంతంలోని ఉదంపూర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా 4జీ సేవలను ప్రారంభించాం. మిగితా జిల్లాల్లో మాత్రం 2జీ సేవలు మాత్రం కొనసాగుతాయి’’ అని హోంశాఖ పేర్కొంది.

 4జీ సేవలను పునరుద్ధరించే విషయంలో ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని నియమించింది. ఆ కమిటీ రూపొందించిన, పేర్కొన్న విషయాలను పరిగణనలోకి తీసుకునే ప్రభుత్వం ఈ రెండు జిల్లాల్లో 4జీ సేవలను పునరుద్ధరించిందని అధికారులు పేర్కొన్నారు.

ఈ రెండు జిల్లాల్లో కూడా ఆయా వ్యక్తుల విషయాలను ధ్రువీకరించిన తర్వాతే మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని జిల్లా అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.