
పశ్చిమ బెంగాల్‌కు మావోయిజం తిరిగొచ్చిందని ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖార్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సర్కార్‌పై ధన్‌ఖార్ తీవ్ర ఆరోపణలు చేశారు. కోల్‌కతాలోని రాజ్ భవన్ నిఘాలో ఉందని, అక్కడి సమాచారం బయటకు పొక్కుతోందని విమర్శించారు.
పంద్రాగస్టుకు రాజ్ భవన్‌లో హాజరవ్వబోయే అతిధుల వివరాలు 14వ తేదీనే ఎలక్ట్రానికల్‌గా లీక్ అయ్యాయని విస్మయం వ్యక్తం చేశారు. ‘రాజ్ భవన్ సర్వైలెన్స్‌లో ఉంది. ఇది జరగకూడదు. రాజ్యాంగం పరిధిలోకి వచ్చే ఆఫీసుపై నిఘా ఎలా వేస్తారు?” అని ప్రశ్నించారు.
తమ విచారణ ముగిసిన వెంటనే నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని గవర్నర్ హెచ్చరించారు. ప్రజా సేవకులు రాజకీయ వ్యవహారాల్లో తల దూర్చకూడదని స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని తేల్చి చెప్పారు.
మాజీ దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా రాజ్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా ధన్‌ఖార్ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం మమతా బెనర్జీని కూడా ధన్‌ఖార్ విమర్శించారు.
‘రాష్ట్రంలో న్యాయ రాహిత్యం ఉంది. హూగ్లీ జిల్లాలో పంద్రాగస్టున ఒకర్ని చంపేశారు. నేతల మద్దతుతో మావోయిజం తన ప్రాభవాన్ని చూపిస్తోంది’ అని మండిపడ్డారు.
More Stories
దశాబ్దం తర్వాత లెఫ్ట్ కంచుకోట జె ఎన్ యు లో ఎబివిపి పాగా!
రక్షణ మంత్రితో సిసిఎస్ అనిల్ చౌహన్ భేటీ!
తమిళనాడు మంత్రులు సెంథిల్, పొన్ముడి రాజీనామాలు