ప్రపంచానికి కావాల్సిన వస్తు ఉత్పత్తి చేద్దాం 

ఇంక ఎంతకాలం ముడి పదార్థాల ఎగుమతి దారుగా మిగిలిపోదాం అని ప్రశ్నిస్తూ  ప్రపంచానికి కావాల్సిన వస్తు ఉత్పత్తిని అత్యున్నత ప్రమాణాలతో తయారు చేద్దామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 
 
74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోటపై తివర్ణ పతాకాన్ని ఎగుర వేసి, దేశప్రజలనుద్దేశించి మాట్లాడుతూ  మన రైతులే ప్రేరణగా అన్ని రంగాల్లో ఆత్మనిర్భర్‌ భారత్‌ను సాధిద్దామని చెప్పారు. భారత్‌ తయారీ వస్తువులను ప్రపంచం ఆదరించేలా వస్తు ఉత్పత్తి చేద్దామని స్పష్టం చేశారు. భారత్‌ అంటే నాణ్యమైన వస్తువుల అడ్డా అన్న ఆత్మగౌరవాన్ని తేవాలని కోరారు. 
 
ఒక నాడు భారత వస్తువులంటే విశ్వవ్యాప్తంగా గౌరవం ఉండేదని, మళ్లీ భారత వస్తువులకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేయాలని  ప్రధాని కోరారు. ఆత్మనిర్భర్‌ అనేది కేవలం నినాదం కాదని, ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం మనందరి సంకల్పం కావాలని హితవు చెప్పారు.
 
ఆధునిక వస్తు ఉత్పత్తే ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటూ . ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటే మన రైతులు నిరూపించి చూపారని, భారత్‌ను ఆకలి రాజ్యం నుంచి అన్నదాతగా మార్చారని కొనియాడారు.
 
 దేశ యువత ఆత్మవిశ్వాసంతో ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించాలని కోరారు. భారత్‌ అంటే క్రమశిక్షణ మాత్రమే కాదు ఉన్నత విలువలతో కూడిన జీవనమని పేర్కొన్నారు. ప్రపంచం ఇప్పుడు పరస్పర ఆధారితమని, ఏ ఒక్కరం ఏకాకిగా మనలేరని ప్రధాని స్పష్టం చేశారు. 
 
విశ్వకల్యాణానికి మనవంతు కూడా నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.  ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటే ప్రపంచంతో మరింత మమేకం కావడమని తెలిపారు. మన శక్తి ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మలచుకోవాలని సూచించారు. 
 
వోకల్‌ ఫర్‌ లోకల్‌ మాటను నిలబెట్టుకుందామని ప్రధాని పిలుపునిచ్చారు. మన ఉత్పత్తులను మనం గౌరవించకపోతే ప్రపంచం ఎలా గౌరవిస్తుందని ప్రశ్నించారు, మన అనందరం మన ఉత్పత్తులకు మన ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పిద్దామని పిలుపిచ్చారు. 
మన యువతకు కొత్త అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని, ఆహార ఉత్పత్తి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో కొత్త అవకాశాలకు యత్నాలు చేస్తున్నట్లు మోదీ తెలిపారు. 
 
వ్యవసాయం నుంచి బ్యాంకింగ్‌ వరకు అన్ని రంగాల్లో సంస్కరణలు ప్రారంభించామని చెబుతూ అనేక సంకటాలు ఎదుర్కొన్న దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తుందని భరోసా వ్యక్తం చేశారు. ఎఫ్‌డీఐ ల్లో గతేడాది 18 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు.