
గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా ఆయనకు చికిత్స అందిస్తున్న ఎంజీఎం హాస్పటల్ వర్గాలు అధికారికంగా బులెటిన్‌ను విడుదల చేశాయి. కరోనా లక్షణాలతో ఈ నెల 5వ తేదీన ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పటల్‌లో చేరారు.
ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ప్రస్తుతం శ్వాస సమస్య నుంచి కూడా ఆయన కోలుకున్నట్లుగా హాస్పటల్ వర్గాలు గురువారం హెల్త్ బులెటిను విడుదల చేశాయి. అయితే గురువారం అర్థరాత్రి నుంచి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఐసీయూకి తరలించినట్లుగా హాస్పటల్ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం నిపుణులైన డాక్టర్లు ఆయనని పర్యవేక్షిస్తున్నారని, లైఫ్ సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నట్లుగా తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో హాస్పటల్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గానే ఉన్నట్లుగా ఎంజీఎం హాస్పటల్ వర్గాలు వెల్లడించాయి.
More Stories
పాకిస్థానీ చొరబాటుదారుడి కాల్చివేత
ఉగ్రవాదులకు నిధుల కేసులో జార్ఖండ్ లో సోదాలు
హిందూ మహిళలపై అంజుమన్ కేసు కొట్టివేత