చైనా ఆన్ లైన్ బెట్టింగ్ గుట్టు రట్టు 

చైనా ఆన్ లైన్ బెట్టింగ్ గుట్టు రట్టు 

చైనాకు చెందిన ఓ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్ పేర్లతో దేశవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా చైనా కంపెనీ వసూలు చేసింది. పలువురి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు చైనాకు చెందిన వ్యక్తితో పాటు నలుగురు  నిందితులను అరెస్ట్ చేశారు  

పోకో పేరుతో ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్న చైనా కంపెనీ పై దాడులు నిర్వహించగా  ఈ చీకటి దందా వెలుగులోనికి వచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో మోసం జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

ఈ ముఠాపై సైబర్ క్రైంలో రెండు కేసులు నమోదు చేశారు.  భారత దేశం లోని యువతను లక్ష్యం చేసుకొని ఈ చైనా ఆన్ లైన్ గేమ్స్ ద్వారా మోసం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

టెలిగ్రాం గ్రూప్ ద్వారా అడ్మిన్ సహాయంతో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. వెబ్‌సైట్స్‌ను ప్రతిరోజు కొత్తగా మార్చుతూ, అందులోని సమాచారాన్ని గ్రూప్‌లో తెలుసుకుంటారని పోలీసులు చెప్పారు. ఈ కంపెనీలో చైనా, భారత్ లు  చెందిన డైరెక్టర్లు ఉన్నారని హైదరాబాద్ పోలీస్ కమీషనర్  అంజనీకుమార్ తెలిపారు. సుమారు రూ.1,100 కోట్ల నగదు లావాదేవీలు జరిగిందని వెల్లడించారు. 

పలు బ్యాంకు ఖాతాల్లో రూ.30కోట్లను పోలీసులు  సీజ్‌ చేశారు. ఒక చైనీయునితో పాటు నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని, ఐటీశాఖకు సమాచారం ఇచ్చామని అంజనీ కుమార్ వివరించారు.  ఆన్‌లైన్‌ గేమింగ్ తెలంగాణలో రద్దైందని గుర్తు చేశారు. 

ఆన్‌లైన్‌ గేమింగ్‌లో మోసపోయి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని, చెబుతూ  ఆన్‌లైన్‌ తమ పిల్లలు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు గమనించాలని సీపీ అంజనీ కుమార్‌ సూచించారు.