నిజాయితీగా వ్యవహరిస్తున్న పన్ను చెల్లింపుదారులను గౌరవిస్తూ వారిని ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోదీ పారదర్శక పన్నువిధానం వేదికను ఇవాళ ప్రారంభించారు.
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పన్నువిధానం అతుకులు లేకుండా, నొప్పి లేకుండా, పన్నుదారుడు నేరుగా హాజరు కాకుండా ఉండే విధంగా తయారు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు.
పన్నువిధానంలో భారీ సంస్కరణలను చేపడుతున్నట్లు చెప్పిన ప్రధాని నిజాయితీ పన్నుదారుడు ఎటువంటి వేదనకు గురికాకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ఆదాయపన్ను, కార్పొరేట్ పన్నులను తగ్గించినట్లు గుర్తు చేశారు. సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నవారిని మరింత్ ప్రోత్సహిస్తామని ప్రకటించారు.
ప్రత్యేక వేదిక ద్వారా ఫిర్యాదులు సులువుగా చేయవచ్చని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పన్ను విధానంలో మరిన్ని సంస్కరణలను తీసుకువస్తున్నట్లు తెలిపారు. పారదర్శక పన్నువిధానంలో ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ అతి పెద్ద సంస్కరణ అని పేర్కొన్నారు.
ఫేస్‌లెస్ అపీల్, పన్నుదారుల పట్టిక కూడా సంస్కరణలో భాగమే అని వెల్లడించారు. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, ట్యాక్స్ పేయర్ చార్టర్‌లు నేటి నుంచే అమలులోకి వస్తాయని ప్రకటించారు. ఫేస్‌లెస్ అపీల్ సేవలు మాత్రం సెప్టెంబర్ 25 నుంచి అందుబాటులోకి రానున్నట్లు ప్రధాని వెల్లడించారు.
ప్రతి నియమాన్ని కచ్చితంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఏదో ఒక వత్తిడిలో సంస్కరణల పేరుతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని, అలాంటి వాటితో లక్ష్యాలను చేరుకోలేమని ప్రధాని స్పష్టం చేశారు. అలాటి ఆలోచన, వ్యవహారం అన్నీ మారినట్లు ప్రధాని తెలిపారు.
పన్నువిధానాన్ని సాఫీగా తయారు చేయడం తమ ఉద్దేశమని పేర్కొంటూ దేశాభివృద్ధి ప్రయాణంలో పన్నుదారుడి చార్టర్ కూడా పెద్ద ముందడుగే అని తెలిపారు.
పన్నుదారులను మరింత శక్తివంతంగా తయారు చేయడమే ప్రధాని లక్ష్యమని ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పన్నవిధానంలో పారదర్శకత ఉండాలని, నిజాయితీపరుడైన పన్నుదారుల్ని గౌరవించాలన్నదే ప్రధాని లక్ష్యమని వెల్లడించారు
More Stories
హైదరాబాద్ లోనూ అమెరికా అధ్యక్షుడి స్కై స్క్రేపర్స్!
ఎయిర్ ఇండియా- విస్తారా విలీనం పూర్తి
‘స్పామ్ ట్రాకింగ్ సిస్టమ్’తో రోజూ 1.35 కోట్ల ఫ్రాడ్ కాల్స్ బ్లాక్