బెంగళూరు హింసలో ఉగ్రవాదుల హస్తం

కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి ఇంటిపై జరిగిన దాడి వెనుక ముస్లిం ఉగ్రవాదుల పాత్ర ఉన్నదని  కర్ణాటక   రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై వెల్లడించారు.  
 
ఈ దాడిలో సోషల్ డెమోక్రాటిక్ పార్టీ పాత్ర ఉన్నట్లు పోలీస్ దర్యాప్తులో వెల్లడైనదని, ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు. వారిలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజాంమిల్ పశ కూడా ఉన్నారు. 
 
 ‘‘ఎమ్మెల్యేకు, అనుచరులకు మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలున్నాయి. అలాగే ఎమ్మెల్యేకూ, సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు తీవ్రమైన భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి” అని తెలిపారు. 
 
ఈ ఘటన పెద్ద కుట్రలో భాగమే అని స్పష్టం చేస్తూ  సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పాత్ర కూడా పెద్దదే అని వెల్లడించారు. ఈ విషయంపై లోతుగా విచారణ జరుపుతున్నామని, ఎస్‌డీపీఐ పాత్ర కూడా ఉందన్న వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. 
 
కుట్ర దారుల గుట్టు రట్టు చేసేవరకు తమ ప్రభుత్వం విశ్రమించబోదని స్పష్టం చేశారు. పలు కోణాల నుండి దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు.