గెహ్లాట్ పై బిజెపి అవిశ్వాస తీర్మానం 

తిరుగుబాటు నేత సచిన్ పైలట్ ను దారిలోకి తెచ్చుకోవడంతో రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం ముగిసిపోయిన్నట్లు కాంగ్రెస్ పార్టీ సంబర పడుతుండగా, ఆ పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే దిశలో బిజెపి అడుగులు వేస్తున్నది. 
 
గెహ్లాట్ ‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని బీజేపీ నేత, రాజస్తాన్‌ మార్కార్‌పై రాజస్తాన్‌ అసెంబ్లీలో బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే స్పష్టం చేశారు. 
 
గురువారం ఉదయం బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ సీఎం వసుంధరతో పాటు ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. 
 
ఈ అంశంపై ప్రతిపక్ష నేత గులాంచంద్ కటారియా మాట్లాడుతూ… ‘‘కాంగ్రెస్ బట్టను తిరిగి కుట్టడానికి ప్రయత్నిస్తోంది. కానీ అది చిరిగిన బట్ట. దానిని అతికించడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. ఇది తొందరగా కూలిపోయే సర్కార్.’’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
రాజస్తాన్‌ అసెంబ్లీలో శుక్రవారం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని కటారియా ప్రకటించారు. 
‘‘ప్రభుత్వ పక్షంలో చెప్పలేనన్ని విభేదాలున్నాయి. వారు పోట్లాడుతున్న పరిస్థితి చూస్తుంటే… వారు బల పరీక్ష వైపే మొగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ… మేమే సర్కారుపై అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి సర్వం సిద్ధం చేసుకున్నాం’’ అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సతీశ్ పూనియా ప్రకటించారు.